శ్రీ షిరిడీ సాయి బాబా మందిరం మణిపురి కాలనీ యందు 10 సంవత్సరము ల క్రితం కాలనీ వాసులు అందరూ కలిసి కాలనీ యందు గల ఖాళీ స్థలంలో (పూడ్చిన పెద్ద వ్యవసాయ బావి పైన ) నిర్మించారు. శ్రీ షిరిడీ సాయి బాబా మందిరం 2011 వ సంవత్సరం నుండి ప్రతి రోజూ 4 హారతులు, అర్చన, పూజా కార్యక్రమాలు, ప్రతి గురువారం అభిషేకం, అన్నదానం, పర్వదినముల సమయం లో ప్రత్యేక పూజలు, హోమాలు జరుపుకుంటూ భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనేవారు. గత రెండు సంవత్సరాలుగా పూడ్చినబావి కుంగిపోయి మందిర గోడలు, ఫ్లోరింగ్ పాడవడం, విగ్రహం కదలిక జరిగింది. గత సంవత్సరం వర్షాలు అధికంగా కురవటం వల్ల ఎక్కువ లోతు గా కుంగిపోయి మందిర గోడలు భక్తులపై పడే ప్రమాద స్థాయిలో వుండడం వల్ల కాలనీ వాసులు మరియు శ్రీ సాయి భక్తులు పాత కట్టడం తొలగించి శాశ్వత పరిష్కారంతో పునర్నిర్మాణం చేయాలని నిర్ణయించారు.
అన్ని దానములలోకెల్ల అన్నదానము మిన్న. పవిత్ర గంగానది లో స్నానమాచరించినా, ఒక్కరికి అన్నదానం చేస్తే అంతటి మహాపుణ్యము కలుగుతుందని పురాణాలు ఘోషిస్తున్నయి.
ఎక్కడా జరగని విధముగా మూలవిరాట్ కు ప్రతి నిత్యము అభిషేకం ఉదయం 6 గంటలకు ప్రారంభం అవుతుంది.
మన మనస్సు ఆందోళన నుండి విముక్తి పొందేలా ప్రశాంతత మరియు శాంతి ధ్యానం వల్ల కలుగుతుంది. ధ్యానంలో వచ్చే ఆనందం ద్వారా మనం ఆనందకరమైన, స్వచ్ఛమైన స్థితిని అనుభవించగలుగుతాము.
మానవుడు తన పరమపద సోపాన మార్గంలో సనాతన ధర్మం మరువరాదు. ఆధ్యాత్మికత మేళవించినటువంటి ఈ మార్గంవలన మానవునికి చక్కని జ్ఞానం అలవడుతుంది. అది సకల మానవాళికి మాత్రమే కాదు విశాల విశ్వానికి శాంతిని చేకూరుస్తుంది.
పునః నిర్మాణంలో ఉన్న దేవాలయం యొక్క పురోగతి
పునః నిర్మాణంలో ఉన్న దేవాలయం యొక్క పురోగతి
పునః నిర్మాణంలో ఉన్న దేవాలయం యొక్క పురోగతి